Prabhas, Keerthy Suresh: హర్‌ ఘర్‌ తిరంగా వీడియో చూశారా.. అదిరిపోయింది!

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడానికి నిర్ణయించుకున్న విసయం తెలిసిందే. ఇందులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ఓ నినాదాన్ని ఎత్తుకుంది. మన జాతీయ పతాక రూపకర్త పింగలి వెంకయ్యను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కోసం కేంద్రం ఓ వీడియో సాంగ్‌ను రూపొందించింది. అందులో దేశంలో ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చింది. కేంద్రం విడుదల చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బుధవారం ‘హర్ ఘర్ తిరంగ’ (ప్రతి ఇంట త్రివర్ణ పతాకం) అనే పాటను రిలీజ్ చేసింది. ఇందులో ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, ప్రభాస్‌, అజయ్‌ దేవగణ్‌ ఉన్నారు. అలాగే కథానాయికలు కీర్తి సురేష్, అనుష్క శర్మ కూడా కనిపించారు. ప్రముఖ గాయని ఆశా భోంస్లే, ప్రముఖ నటులు అనుపమ్‌ ఖేర్‌, జాకీ ష్రాఫ్‌ కూడా కనిపించారు.

జావెలిన్‌ వీరుడు నీరజ్‌ చోప్రా, ప్రముఖ బాక్సర్‌ మేరీ కోమ్‌, తెలుగు తేజం పీవీ సింధు కనిపించారు. క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ని కూడా చూడొచ్చు. పరుగుల రాణి పీటీ ఉష కూడా ఉంది. ఆగస్ట్ 13 – 15 వరకు జరిగే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ప్రభాస్ తెలుగులో ‘ఇంటింటా జెండా’ అంటూ స్వరం కలపగా..

కీర్తి సురేష్ తమిళంలో చెప్పింది. ఈ వీడియోలో దేశంలోని ప్రముఖ ప్రాంతాలను చూపించారు. ఆయా ప్రాంతాల్లో మన జెండా రెపరెపలాడటం కూడా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరూ చూసేయండి. హర్‌ ఘర తిరంగా కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!


అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus