గత శుక్రవారం విడుదలైన ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ‘సాహో’ చిత్రం తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలైంది. ఇక మొదటి షో తోనే అలా నెగిటివ్ టాక్ రావడంతో బాలీవుడ్ క్రిటిక్స్ ‘సాహో’ చిత్రానికి ఘోరమైన రేటింగ్స్ ఇవ్వడంతో పాటు, ఇదే ఛాన్స్ అన్నట్టు తెలుగు సినిమా గురించి సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. ఇక ఆ రేటింగ్స్ చూసి మన తెలుగులో కూడా ‘సాహో’ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం జరిగింది. ‘సాహో’ చిత్రంలో చాలా హైలెట్స్ ఉన్నప్పటికీ… విమర్శిస్తూనే, ఘోరమైన రేటింగ్ లు ఇచ్చారు. ఇక ఈ రివ్యూలు, రేటింగ్ లు చూసిన తర్వాత ‘సాహో’ చిత్రానికి జరిగిన బిజినెస్ లో కనీసం 25 శాతం అయినా వసూళ్ళు వస్తాయా అనే అనుమానం కలిగింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘సాహో’ ఊహించని విధంగా మంచి వసూళ్ళు రాబడుతుంది.
ఇప్పటికే ‘సాహో’ చిత్రం వసూళ్ళు 53 శాతం రికవరీ అయ్యింది. తెలుగు కంటే మించిన ఆదరణ హిందీ వర్షన్ కు దక్కడం విశేషం. ఇప్పటికే అక్కడ 93 కోట్ల వరకూ కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ముఖ్యంగా నార్త్, ఈస్ట్ ఇండియాల్లో ‘సాహో’ ఇరక్కొట్టేస్తుంది. యూఎస్ మరియు కొన్ని తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నష్టాలు రావొచ్చని ట్రేడ్ చెబుతున్నప్పటికీ… చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మరియు స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది అని వారు చెబుతున్నారు. దీంతో ప్రభాస్… రాజమౌళి సెంటిమెంట్ ను జయించాడనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో రాజమోళితో సినిమా చేసిన ఏ హీరో సినిమా అయినా ఘోరంగా డిజాస్టర్లు అయిన సంగతి తెలిసిందే. ‘సాహో’ తో ప్రభాస్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది.