“భరత్ అనే నేను” ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. “సినిమా బాలేదంటే నా ఫ్యాన్స్ కూడా చూడరు” అని కామెంట్ చేసిన విషయం అండరికీ ఇంకా గుర్తు ఉండే ఉంటుంది. మహేష్ అలా మాట్లాడడానికి కారణం స్పైడర్ రిజల్ట్. ఆ సినిమాను కనీసం తన ఫ్యాన్స్ అందరు చూసినా హిట్ అయ్యేదని మహేష్ ఇప్పటికీ చెబుతుంటాడు. ఇక పవన్ కళ్యాణ్ డిజాస్టర్స్ అయిన “సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ణాతవాసి” సినిమాలకి వచ్చిన ఓపెనింగ్స్ కి ఆ తర్వాత రోజు వచ్చిన కలెక్షన్స్ కి ఎక్కడా సంబంధం ఉండదు. అంటే.. టాక్ తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా థియేటర్లకు వెళ్లలేదు అని స్పష్టమవుతోంది. ఈ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను మెచ్చుకోవాల్సిందే.
ఎందుకంటే.. “సాహో” విడుదలరోజు దాదాపు డిజాస్టర్ అని రివ్యూలు మరికొన్ని విశ్లేషణలు తేల్చేసినప్పటికీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం “సాహో” చిత్రాన్ని ఒకటికి రెండుసార్లు థియేటర్లలో చూసి సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. కలెక్షన్స్ పరంగా సినిమా ఇంకా సేఫ్ జోన్ లోకి రాలేదు కానీ.. కనీసం ఈమాత్రం రావడానికి కారణం కూడా ప్రభాస్ లోయల్ ఫ్యాన్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో ఇండస్ట్రీలో.. పవన్ కళ్యాణ్ & మహేష్ బాబుల కంటే ప్రభాస్ ను మంచి అభిమానులున్నారు, సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తమ హీరోను సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పుకొంటున్నారు. ఆలోచిస్తే నిజమే అనిపించింది మరి.