ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు ఈ క్రమంలోనే తమ అభిమానుల హీరోలు నటించినటువంటి సినిమాలు తిరిగి థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాలను విజయవంతం చేసే పనిలో ఉన్నారు. ఇలా హీరోల సినిమాలు విడుదలవుతున్నటువంటి తరుణంలో పలువురు హీరోల అభిమానులు కాస్త అత్యుత్సాహం కనబరుస్తున్నారు. థియేటర్లకు వచ్చి తమ హీరో సినిమా చూసి ఆనందించామా లేదా అన్నది కాకుండా ఆ ఆనందంలో వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తెలియకుండా వ్యవహరిస్తున్నారు.
సినిమాలలో పాటలు ఫైట్స్ సన్ని వేషాలు వస్తున్నటువంటి సమయంలో రెచ్చిపోతూ థియేటర్లను ధ్వంసం చేసే పనిలో పడ్డారు.తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమాని తిరిగి విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఈ సినిమా థియేటర్లలో సినిమాలో పాటలు వస్తున్నటువంటి తరుణంలో అభిమానులు కూడా ఆనందంతో రాజ్ థియేటర్లో డాన్స్ చేస్తూ పొరపాటున స్క్రీన్ మీద పడ్డారు.
దీంతో స్క్రీన్ మొత్తం చినిగిపోయింది. కాకినాడ జిల్లా శ్రీ ప్రియ థియేటర్స్ వద్ద కూడా ఇదే సంఘటన చోటుచేసుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తమ సంబరాల్లో మునిగిపోయి ఆనందంతో ఏం చేస్తున్నారో కూడా తెలియనట్లుగా బిహేవ్ చేశారు. స్క్రీన్‌ను చింపేశారు దానికి తోడు కొన్ని కుర్చీలను కూడా ధ్వంసం చేశారు. ఈ థియేటర్ గత కొద్ది రోజుల క్రితమే అంత రీ మోడల్ చేయించడం కోసం భారీగానే ఖర్చు చేశారు ఈ తరుణంలోనే అభిమానులు థియేటర్ ను ధ్వంసం చేయడంతో థియేటర్ యాజమాన్యం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కూడా ఈ విషయం గురించి దర్యాప్తుల కొనసాగిస్తున్నారు అయితే ఇలా అభిమానులు థియేటర్లకు వెళ్లి థియేటర్లను ధ్వంసం చేయడం పట్ల పలువురు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హీరోలపై అభిమానం ఉంటే పర్లేదు కానీ ఇలా ఇతర వస్తువులను ద్వంశం చేయడం సరైన పద్ధతి కాదు అంటూ మండిపడుతున్నారు.