ప్రభాస్ ని రానా ఒప్పించగలడా ?
- June 10, 2017 / 06:51 AM ISTByFilmy Focus
బాహుబలి సినిమాతో ప్రభాస్, రానాల మధ్య స్నేహం మరింత బలపడింది. ఐదేళ్ల ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు బాగా అర్ధం చేసుకున్నారు. ప్రభాస్ సొంత విషయాలను ఇతరులతో షేర్ చేసుకోరు. సినిమా గురించి మాట్లాడమన్నా మీడియా ముందు పొదుపుగా మాట్లాడుతారు. పబ్లిక్ లో ప్రసంగించాలంటే ఇంకా సిగ్గు ఎక్కువ. వీటన్నింటి గురించి రానాకి బాగా తెలుసు. అయినా ప్రభాస్ ని ఒప్పిస్తానని రానా అభిమానులకు మాట ఇచ్చాడు. ఏ విషయంలో అంటే .. ట్విట్టర్లో ఖాతాను తెరవడం విషయం గురించి. ప్రభాస్ కి పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ లేదు.
ఇప్పుడు దాదాపు టాలీవుడ్ లో హీరోలందరూ ట్విట్టర్ ఖాతా తెరిచి అభిమానులకు టచ్ లో ఉన్నారు. అందుకే ప్రభాస్ కూడా ఈ వేదికపై రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే విషయాన్నీ ప్రభాస్ ఫ్యాన్స్ రానాకి చెప్పుకోగా.. ‘నేను ప్రయత్నిస్తా, ప్రతిజ్ఞ చేస్తున్నా’ అని రానా మాట ఇచ్చాడు. మరి ప్రభాస్ రానా మాట వింటాడా? లేదా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విషయాలకు వస్తే రానా నేనే రాజు.. నేనే మంత్రి సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా, ప్రభాస్ సాహో కోసం సిద్ధమవుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















