పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఈయన తీవ్రమైనటువంటి మోకాలినొప్పి సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలుమార్లు సర్జరీ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆదివారం ఈయన యుకే వెళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విదేశాలలో ఉన్నటువంటి ప్రభాస్ త్వరలోనే మోకాలు సర్జరీ చేయించుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇలా మోకాలు సర్జరీ అనంతరం 15 రోజులపాటు అక్కడే విశ్రాంతి తీసుకుని అనంతరం తిరిగి ఇండియాకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రభాస్ సర్జరీ కోసమే విదేశాలకు వెళ్లారు అంటూ వార్తలు రావడంతో అభిమానులు ఈయన విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఈయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది
అంతలోపు ప్రభాస్ (Prabhas) కూడా సర్జరీ పూర్తి చేసుకుని తిరిగి పికప్ అవుతారని ఈయన ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ఇండియా చేరుకుంటారని తెలుస్తుంది. ఇక సలార్ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్, కల్కి వంటి భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. అదేవిధంగా మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఇక ఈయన చివరిగా నటించిన ఆది పురుష్ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన పలు విమర్శలను ఎదుర్కొన్నారు అయితే ఈ సినిమా పూర్తిగా నిరాశపరచడంతో అభిమానులంతా ఈయన తదుపరి సలార్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.