రాజమౌళి, ప్రభాస్ మాత్రమే కాకుండా ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ బాహుబలి సినిమాని ఒక తపస్సులా భావించి పూర్తిచేశారు. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా జేజేలు అందుకుంది. రెండో పార్ట్ మరో పద్నాలుగు రోజుల్లో థియేటర్లోకి రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రభాస్ అనేక సంగతులను బయటపెట్టారు. “బాహుబలి సినిమా కోసం చేసిన జర్నీ ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితాన్ని పుస్తకంగా రాసుకుంటే అందులో 30 శాతం బాహుబలి గురించే ఉంటుంది” అని ప్రభాస్ అన్నారు.
ఐదేళ్లపాటు పాటు ఈ సినిమాకోసం కేటాయించడం విషయంలో ఎప్పుడూ బాధపడలేదని, ఈ సమయంలో పది సినిమాలు చేసినా రాని గుర్తింపు బాహుబలి తో వచ్చిందని వివరించారు. “షూటింగ్ సమయంలో నన్ను కంగారు పెట్టిన అంశం బడ్జెట్. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుందోనని భయపడేవాణ్ణి. ఈ భయం అందరిలోనూ ఉన్నింది. అందుకే క్రమశిక్షణగా స్కూల్ కి వెళ్లినట్టు షెడ్యూల్ ప్రకారం నడుచుకునేవాళ్ళం” అని ప్రభాస్ వెల్లడించారు. ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కొంచెం కంగారుగా ఉందని చెప్పారు. 250 కోట్లతో నిర్మితమైన బాహుబలి 2… వెయ్యికోట్లను కొల్లగొట్టేందుకు ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.