టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ప్రభాస్ సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ విడుదల చేశారు. ఈ సినిమాకు రాజా సాబ్ అని టైటిల్ ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇలా సినిమా టైటిల్ తో పోస్టర్ కూడా విడుదల చేశారు అయితే అందులో ప్రభాస్ పేరులో కాస్త మార్పులు వచ్చాయి.
ప్రభాస్ పేరును ఇంగ్లీషులో prabhas అని రాస్తారు కానీ ఈ సినిమా పోస్టర్ లో మాత్రం prabhass అని ఉంది దీంతో ప్రభాస్ పేరు పక్కన మరొక S ఎందుకు యాడ్ చేశారు. బహుశా న్యూమరాలజీ ప్రకారం ఇలా మార్చుకున్నారా లేకపోతే ఎవరైనా జ్యోతిష్యం చెప్పడంతో ఇలా పేరు మార్చుకున్నారా అంటూ ఎన్నో సందేహాలు వచ్చాయి.
ఈ విధంగా ప్రభాస్ పేరు మార్చుకున్నారనే విషయం గురించి మరొక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన మరొక జత చేయలేదని అది prabhas’s కి బదులుగా prabhass అని పడింది అంటూ క్లారిటీ ఇచ్చారు అంతేకానీ న్యూమరాలజీ ప్రకారం జ్యోతిష్యం ప్రకారం ప్రభాస్ తన పేరును మార్చుకోలేదంటూ నిర్మాత ఎస్ కే ఎన్ క్లారిటీ ఇచ్చారు.