టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఒకే సమయంలో మూడు ప్రాజెక్ట్ లలో నటిస్తూ ఇతర స్టార్ హీరోలతో పోల్చి చూస్తే వేగంగా తన సినిమాలను పూర్తి చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఊహించని రేంజ్ లో పాపులారిటీని కలిగి ఉన్న ప్రభాస్ లండన్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. విలాసవంతమైన ఆ ఇంటికి అద్దె ఏకంగా 60 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో ప్రభాస్ రెస్టారెంట్, మాల్స్, మల్టీప్లెక్స్ లకు వెళ్లాలంటే ఆయనకు ఉన్న క్రేజ్, పాపులారిటీ వల్ల ఎక్కడికి వెళ్లాలన్నా సులువు కాదు.
ప్రభాస్ కనిపిస్తే వందల సంఖ్యలో అభిమానులు ఆటోగ్రాఫ్, సెల్ఫీల కోసం పోటీ పడతారు. విదేశాల్లో అయితే స్వేచ్చగా ఎక్కడికైనా వెళ్లొచ్చనే భావనతో ప్రభాస్ లండన్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నారని భోగట్టా. భవిష్యత్తులో ప్రభాస్ లండన్ లో ఇల్లు కొనుగోలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రాజెక్ట్ కే, రాజాసాబ్ సినిమాల షూటింగ్ లతో ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉండగా ఎనిమిది నెలల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
కన్నప్ప సినిమాలో కూడా ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన వెంటనే హను రాఘవపూడి సినిమాతో ప్రభాస్ బిజీ కానున్నారు. ఈ ఏడాది చివర్లో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా సినిమా మొదలుకానుండగా సలార్2 సినిమా గురించి మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
వరుస సినిమాలతో (Prabhas) ప్రభాస్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 100 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రభాస్ పారితోషికం ఉంది. ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ప్రయోగాత్మక సినిమాలలో నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు.