ప్యాలస్ ను తలపించే ప్రభాస్ ఇల్లు
- December 19, 2016 / 10:33 AM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాళీ దొరికితే సొంతూరు (భీమవరం దగ్గర్లోని విలేజ్) కి వెళ్ళిపోతారు. అక్కడే గడుపుతుంటారు. అక్కడ మాత్రమే కాదు హైదరాబాద్ లోను అయన ఓ ఇల్లు ఉంది. జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ గుడికి వెనుక, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంటికి దగ్గరగా తన ఇంటిని ఒక రాజ మహల్ గా నిర్మించుకున్నారు. బయట మోడ్రన్ గా కనిపించే భవనం.. లోపలికి వెళితే ఫ్యాలెస్ లో అడుగు పెట్టిన అనుభూతిని ఇస్తుంది. 1236 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవనంలో 5 బెడ్ రూమ్స్, మూడు హాల్స్ ఉన్నాయి.
ఫ్లోర్ కి మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ వాడారు. అంతేకాదు ఇందులో జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్ కూడా ఉన్నాయి. ఈ ఇంట్లో కనిపించే ఫర్నిచర్ అంతా చాలా విలువైనది. ఈ ఫర్నిచర్ గదులకు రాయల్ లుక్ ని అందిస్తోంది. అన్ని వసతులున్న ఈ ఇంటి విలువ 30 కోట్లు ఉంటుందని అంచనా. బాహుబలి కంక్లూజన్ షూటింగ్ తర్వాత పెళ్లి చేసుకోనున్న ప్రభాస్ ఈ ఇంటిలోనే భార్యతో కలిసి ఉండనున్నారు. అందుకు భవనంలో చిన్న పాటి మరమ్మతులు జరుగుతున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















