‘అర్జున్ రెడ్డి’ తో ఓ గేమ్ ఛేంజర్ మూవీని టాలీవుడ్ కి అందించాడు దర్శకుడు సందీప్ వంగా. ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో కూడా రీమేక్ చేసి అక్కడా ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో అతనికి తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా బడా ఛాన్స్ లు లభిస్తున్నాయి.’కబీర్ సింగ్’ చిత్రం దాదాపు రూ.250 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్ళని సాధించింది. దీంతో హిందీలో కూడా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు.
ఇక త్వరలో సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అది కూడా ‘అర్జున్ రెడ్డి’ స్టైల్లోనే ఉంది అనే కామెంట్స్ వినిపించాయి. విడుదలైన రెండు పాటలు కూడా అదే శైలిలో ఉన్నాయి అని కూడా అంటున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..! అది పక్కన పెట్టేస్తే..’యానిమల్’ సినిమా రిలీజ్ అయ్యాక..
సందీప్ రెడ్డి వంగా ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. అయితే సందీప్ ఇప్పటికే రెండు బడా ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. ఒకటి ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే మూవీ. ఇంకోటి.. అల్లు అర్జున్ తో..! అలాగే హిందీలో కూడా రెండు, మూడు ప్రొడక్షన్ హౌస్ లు అడ్వాన్స్ ఇచ్చాయి. ముందుగా అయితే టి. సిరీస్ సంస్థ తో రెండు చేయాలి. అయితే ఎక్కువ శాతం … సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ మొదలు పెట్టే అవకాశం ఉంది. మరోవైపు (Prabhas) ప్రభాస్ … కల్కి, మారుతీ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కంప్లీట్ చేయాలి.