పాన్ ఇండియా స్టార్ హీరోగా నటిస్తున్న వరుస సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ కూడా ఒకటి. నిజానికి ఇది చాలా రిస్కీ ప్రాజెక్టు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో రూ.500 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇది. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ ను కూడా రూ.450 – రూ.470 కోట్ల మధ్యలోనే ఫినిష్ చేశారు. రాజమౌళి వంటి వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన దర్శకుడితో చేస్తే రూ.500 కోట్లు కాదు..
రూ.1000 కోట్ల బడ్జెట్ పెట్టినా భయపడనవసరం లేదు. కానీ ప్రాజెక్ట్ కె ని డైరెక్ట్ చేస్తుంది నాగ్ అశ్విన్. ఇతని మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ని రూ.6 కోట్ల బడ్జెట్ లో ఫినిష్ చేశాడు. ఇక రెండో చిత్రం ‘మహానటి’ ని రూ.20 కోట్ల బడ్జెట్ లో ఫినిష్ చేశాడు. అవి రెండు కూడా నిర్మాతకు లాభాలు మిగిల్చాయి. అయితే ప్రభాస్ తో రూ.500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుంటే..
ఆ స్థాయిలో సినిమాకి బిజినెస్ జరుగుతుందా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ కు ఫ్యాన్సీ ఆఫర్లు దక్కుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘పాజెక్టు కె’ నైజాం హక్కులు రూ.62 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఇప్పటివరకు నైజాంలో ఆర్.ఆర్.ఆర్ మాత్రమే రూ.80 కోట్ల బిజినెస్ చేసింది. ఆ సినిమా ఫైనల్ గా రూ.100 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసి బయ్యర్స్ కు ప్రాఫిట్స్ ను అందించింది.
దాని తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రానికి రూ.40 కోట్లు, ‘రాధే శ్యామ్’ కు రూ.37కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమాలు సక్సెస్ అవ్వలేదు. సాహో నైజాం లో రూ.30 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే, రాధే శ్యామ్ రూ.25 కోట్లు షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. మరి ‘ప్రాజెక్ట్ కె’ కి నైజాంలో రూ.62 కోట్ల బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.