Kannappa: కన్నప్పలో ప్రభాస్ సీన్స్..40 నిమిషాలు అనుకుంటే..!

మంచు విష్ణు (Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) పై భారీ అంచనాలు ఉన్నాయి. పౌరాణికం, భక్తిరసం కలగలసిన ఈ కథను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు మంచు విష్ణు బృందం శ్రమిస్తోంది. ఇక స్టార్ క్యాస్టింగ్, గ్రాండ్ విజువల్స్, ఆసక్తికరమైన కథాంశంతో రానున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే, ఈ పాత్ర నిడివి ఎంత ఉంటుందనే దానిపై ఇప్పటికే అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Kannappa

మొదట ప్రభాస్ (Prabhas) పాత్రకు 40 నిమిషాల నిడివి ఉంటుందని మేకర్స్ భావించారు. కానీ అతని బిజీ షెడ్యూల్‌ల కారణంగా, ఇది గెస్ట్ అప్పియరెన్స్‌గా మార్చబడిందట. కేవలం 5 నిమిషాలపాటు ప్రభాస్ స్క్రీన్‌పై కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. నందీశ్వరుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారట. ఈ పాత్రకు గ్రాఫిక్స్‌తో హై లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయని సమాచారం. చిన్న గెస్టు పాత్రే అయినా, ప్రభాస్ కనిపించే సీన్లు హైలైట్‌గా నిలుస్తాయని భావిస్తున్నారు.

ఈ పాత్రకు సంబంధించిన కొన్ని లుక్స్ గతంలో లీక్ అయినప్పటికీ, మేకర్స్ వెంటనే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక అక్షయ్ కుమార్  (Akshay Kumar) , మోహన్ లాల్ (Mohanlal) ,, శివరాజ్ కుమార్‌లు (Shiva Rajkumar), కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. స్టార్ క్యాస్ట్ తోనే కథను మరింత ప్రాముఖ్యంగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తుండగా, మోహన్ లాల్ కిరాత అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు.

వీరి పాత్రలు ప్రధాన కథకు కీలకమైన మలుపులు ఇస్తాయని సమాచారం. 2025 ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతోంది. ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా, ఆ 5 నిమిషాలు సినిమాకు సాలీడ్ వైబ్ తీసుకు వస్తుందని సమాచారం.

నితిన్ మాటను లెక్క చేయట్లేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus