టాలీవుడ్ లో రకరకాల వర్గాలు ఉన్నాయి….రకరకాల వంశాలు ఉన్నాయి….కొందరు ఒక వర్గాన్ని అభిమానిస్తే….మరి కొందరు మరి వర్గానికి జై కొడతారు…ఇక కొందరు ఒక వర్గానికి మద్దతుగా నిలబడితే….మరికొందరు…మరొక వర్గాన్ని నెత్తిన పెట్టుకు మోస్తారు…అయితే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న ప్రభాస్ మాత్రం అందరికీ నచ్చే హీరో…నిర్మాతలు అందరూ వర్గ భేధం లేకుండా….ప్రభాస్ ను అభిమానిస్తూ ఉంటారు….ప్రభాస్ సైతం ఎంత బడా హీరో అయినా…నిర్మాతల విషయంలో చాలా సింపల్ గా ఉంటాడు…ఇదిలా ఉంటే…బాహుబలి2 పుణ్యమా అని ప్రభాస్ మారిపోయాడట…అయితే అదేదో నేను చెబుతున్న మాట కాదు…సాక్షాత్తూ బాలీవుడ్ చెబుతున్న మాట…విషయంలోకి వెళితే…హైదరాబాద్ లో ‘బాహుబలి 2’ ట్రైలర్ లాంచ్ చేసిన తరువాత ప్రభాస్ రాజమౌళితో కలిసి ముంబాయి వెళ్ళి అక్కడ ‘బాహుబలి 2’ హిందీ ట్రైలర్ ను లాంచ్ చేసాడు. అయితే అక్కడ అతడిని కలవడానికి ప్రయత్నించిన చాలామంది బాలీవుడ్ నిర్మాతలకు ప్రభాస్ సున్నితంగా తాను మళ్ళీ ముంబాయి వస్తాను అంటూ చెప్పి జారుకున్నట్లు టాక్.
దీనితో నిర్మాతల విషయంలో ప్రభాస్ తీరును తప్పుబడుతూ బాలీవుడ్ రకరకాల కధనాలను రాస్తుంది…. దీనికితోడు టాలీవుడ్ కు సంబంధించిన బడా నిర్మాతలు కొందరు గత కొంత కాలంగా ప్రభాస్ ను కలిసి తమ తదుపరి సినిమాలకు బుక్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా ప్రభాస్ ఎవరికీ అందకుండా చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ప్రభాస్ తన పై కనీసం 100 కోట్ల పైన పెట్టుబడి పెట్టగల నిర్మాతల గురించి అన్వేషణ చేస్తున్నట్లు టాక్. అదీకాకుండా ప్రభాస్ తన తదుపరి సినిమాలు అన్నీ తన సొంత నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే వీలైనంత వరకు చేయాలని ఒక నిర్ణయంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడే ప్రభాస్ నిర్మాతలకు అందకుండా పోతే….రేపు నిజంగా బాహుబలి 1000కోట్ల వసూళ్లు సాధిస్తే ప్రభాస్ రేంజ్ ను అందుకునే అవకాశం మన టాలీవుడ్ నిర్మాతలు ఆశలు ఉండదు అని చెప్పాక తప్పదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.