Prabhas, Allu Arjun: పుష్ప రాజ్ పెద్ద ప్లానే వేశాడు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. దీంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలను ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డిసెంబర్ 6న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బన్నీ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఐటెం సాంగ్ ను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.

ఈ పాటలో సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన తరువాత డిసెంబర్ నుంచి పూర్తిగా సినిమా ప్రమోషన్స్ కే సమయం కేటాయించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ గా వస్తే..

సినిమాపై బజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నారు. మరి పుష్పరాజ్ కోసం వస్తాడో లేదో తెలియాల్సివుంది. ఈ ఈవెంట్ ను డిసెంబర్ రెండో వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus