బాహుబలి చిత్రంతో ప్రభాస్ ప్రపంచమంతా అభిమానులను ఏర్పరుచుకున్నారు. అందులో అమరేంద్ర బాహుబలి క్యారక్టర్ కి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. అందుకే మైనపు ప్రతిమలకు ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు.. అమరేంద్ర బాహుబలి మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఉత్సాహం చూపించారు. గత ఏడాది అక్టోబర్ లో హైదరాబాద్ కి వచ్చిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు ప్రభాస్ శరీర కొలతలను తీసుకొని వెళ్లారు. దాదాపు ఏడు నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహానికి చెందిన ఫోటోలు నేడు రిలీజ్ అయ్యాయి.
ఈ విగ్రహాన్ని చూస్తుంటే సజీవ అమరేంద్ర బాహుబలిని చూసినట్టే ఉంది. కొన్ని రోజుల్లో ఈ విగ్రహాన్ని బ్యాంకాక్ లోని మ్యూజియంలో ఏర్పాటుచేయనున్నారు. మనదేశం నుంచి ఈ మ్యూజియంలో కొలువుదీరనున్న మూడో వ్యక్తి ప్రభాస్ కావడంతో అయన అభిమానులు సంతోషపడుతున్నారు. ఇక నుంచి స్పైడర్‌మెన్, సూపర్‌మెన్ తో కలిసి సెల్ఫీ తీసుకున్నట్లే అమరేంద్ర బాహుబలితో ఫొటోలు దిగవచ్చు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.