Pragya Jaiswal: అఖండ వల్ల ప్రగ్యాకు లాభం లేదా?

సాధారణంగా ఏదైనా సినిమా సక్సెస్ సాధిస్తే ఆ సినిమాలో నటించిన హీరోహీరోయిన్లు, డైరెక్టర్ల కెరీర్ కు ప్లస్ అవుతుంది. అఖండ సినిమా సక్సెస్ తో బాలయ్య తరువాత సినిమాల నిర్మాతలు సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సైతం ఒక సినిమా ఫిక్స్ అయిందని వార్తలు వస్తుండగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అఖండ ప్రగ్యా కెరీర్ కు ప్లస్ కాలేదని తెలుస్తోంది.

అఖండ తర్వాత ప్రగ్యా జైస్వాల్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అఖండలో ప్రగ్యా జైస్వాల్ పాత్రపై కూడా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొదట ఈ పాత్రకు నయనతార ఎంపికయ్యారని వార్తలు వచ్చినా కొన్ని కారణాల వల్ల నయనతార ఈ సినిమాలో నటించలేదు. అయితే అఖండ సక్సెస్ వల్ల ప్రగ్యా జైస్వాల్ కు దక్కిందేమీ లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అఖండ సినిమాకు ముందు సైతం ప్రగ్యా జైస్వాల్ నటించిన సినిమాలు సక్సెస్ సాధించలేదు.

అఖండ, కంచె మినహా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో హిట్లు లేవు. అఖండ సక్సెస్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ కు ఏ మాత్రం ప్లస్ కాలేదని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇతర భాషల్లో ప్రగ్యా జైస్వాల్ అవకాశాల కోసం ప్రయత్నిస్తే మంచిదని కొంతమంది సూచిస్తున్నారు. అందం, అభినయం ఉన్నా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ప్రగ్యా జైస్వాల్ కు ఛాన్స్ ఇస్తే మాత్రమే ఆమె కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా జైస్వాల్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరుసగా ప్రగ్యా జైస్వాల్ నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆమెకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2022 సంవత్సరంలో అయినా ప్రగ్యాకు ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus