Prakash Raj: ”పార్టీకి వెళ్లడం, మందు కొట్టడంలో తప్పులేదు”

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ నటుడు నరేష్ నటీనటులకు విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. శనివారం నాడు సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఈ పార్టీ జరగబోతుంది. తాజాగా ఈ పార్టీపై అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ స్పందించారు. అసోసియేషన్ కు సంబంధించి ఎన్నో అంశాల్లో నరేష్ తో విభేదించిన ప్రకాష్ రాజ్ నైట్ పార్టీ విషయంలో నరేష్ కు మద్దతు పలికారు.

నైట్ పార్టీలు చేసుకోవడంలో తప్పు లేదని.. ప్రతి ఒక్కరూ వాళ్ల మెంబర్స్ ను కలవాలని.. పగలంతా షూట్ ఉంటుంది కాబట్టి రాత్రిళ్లు కలుస్తున్నారేమో అని అన్నారు. వాళ్ల ప్రైవేట్ విషయాలపై కామెంట్ చేయనని.. అలాంటి పార్టీలను తప్పుపట్టకూడదని.. అందరూ కళాకారులే అని.. సాయంత్రం వేళల్లో కలుసుకుంటారని అన్నారు. ఓ ముప్పై మంది పార్టీ చేసి మాట్లాడుకుంటారని.. మరో పది మందికి చెబుతారని.. కాంపెయిన్ అలానే జరుగుతుందని..

అందులో తప్పులేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలా ఇంటింటికి వెళ్లలేరు కదా.. బాగా పరిచయస్తులను పార్టీకు పిలుస్తారు.. కలిసి భోజనం చేస్తారు.. మందు కొడతారు అందులో తప్పు లేదంటూ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Share.