2020 సంక్రాంతికి బాక్సాఫీస్ హీటెక్కడం ఖాయం అని ఈపాటికే అందరికీ అర్థమైపోయింది. ఈ రెండు చిత్రాలతో పాటు ‘దర్బార్’ ‘ఎంత మంచివాడవురా’ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ‘స్పైడర్’ ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ చిత్రాలకి 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి కూడా 105 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
ఇక యూత్.. మరియు ఫ్యామిలీస్ లో బన్నీ క్రేజ్ పీక్స్ అనే చెప్పాలి. అందులోనూ దర్శకుడు త్రివిక్రమ్ తో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్లు ఉండడంతో.. ‘అల వైకుంఠపురములో’ చిత్రం పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ గత చిత్రం ‘నా పేరు సూర్య’ చిత్రానికి 80 కోట్ల వరకూ బిజినెస్ జరుగగా.. ఈసారి ఏకంగా 98 కోట్ల నుండీ 102 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ రెండు చిత్రాలకి ఏరియా వైజ్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.