Siri, Shrihan: సిరి జాతకంలో నిజంగానే అలా రాసి ఉందా..? జ్యోతిష్యురాలు శాంతి ఇచ్చిన క్లారిటీ..!

బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజుల నుంచీ సిరి చాలా డిస్టర్బ్ మూడ్ లో ఉంది. సన్నీపై జరిగిన గొడవ, షణ్ముక్ ఇచ్చే సలహాలతో కన్ఫూజ్ అయిపోతోంది. రాత్రిపూట నిద్రలేకుండా ఏడుస్తున్న సిరిని ఓదార్చాడు షణ్ముక్. నువ్వు ఒక్క గేమ్ ఓడిపోతే ఇక్కడివరకూ ఎలా వచ్చావ్ అంటూ సముదాయించాడు. ఆ తర్వాత బాత్రూమ్ లో గుక్కపట్టి మరీ ఏడ్చింది సిరి. తన మీద మీదకి సన్నీ వచ్చాడని, కొట్టడానికి వచ్చాడన్నట్లుగా మాట్లాడింది.

దీంతో ఎవడికీ అంత సీన్ లేదని తేల్చి మరీ చెప్పాడు షణ్ముక్. నేను ఏదైనా అంటే నువ్వు ఫీల్ అవ్వాలి కానీ, ఎవడినీ పట్టించుకోవద్దు అంటూ చెప్పాడు. ఇక్కడే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కూడా సిరి బాగా డిస్టర్బ్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకునేందుకు బిగ్ బాస్ జ్యోతిష్యురాలు శాంతిని పంపించాడు. టివిలోనుంచే హౌస్ మేట్స్ ని పలకరిస్తూ వారి జీవితంలో జరిగే మార్పుల గురించి చెప్పింది శాంతి.

షణ్ముక్ గురించి చెప్తూ.. మీ జీవితంలో మంచి మార్పు వస్తుందని, ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పింది. అంతేకాదు, కొత్త అవకాశాలని అంది పుచ్చుకుంటారని, భవిష్యత్ చాలా బాగుంటుందని భరోసా ఇచ్చింది. ఇక సన్నీతో మాట్లాడుతూ ఒక కొత్త గర్లఫ్రెండ్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. బయటకి వచ్చిన తర్వాత స్వప్న సుందరి ఖచ్చితంగా కనిపిస్తుందని హామీ ఇచ్చింది. త్వరలోనే ప్రేమలో మునిగి తేలతావని హింట్ ఇస్తూనే, కెరియర్ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పింది.

ఇక సిరి గురించి మాట్లాడుతూ, త్వరలోనే నీకు పెళ్లి బాజాలు మోగుతాయని, తర్వాత ఫారిని ట్రిప్ కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తారంటూ చెప్పింది. మీలో చిన్న చిన్న భయాలని తీసేస్తే చాలా సంతోషంగా ఉంటారంటూ చెప్పింది. ఆతర్వాత శ్రీరామ్ చంద్ర గురించి మాట్లాడుతూ గెలుపు కార్డ్ వచ్చిందని, అస్సలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని మాట్లాడింది. మానస్ బిగ్ బాస్ జెర్నీ తర్వాత నీకు ఎంతో ఆత్మతృప్తి కలుగుతుందని, ఎన్నో విజయాలని సాధిస్తారని భరోసా ఇచ్చింది జ్యోతిష్యురాలు శాంతి.

[yop_poll id=”7″]

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus