నటి తులసి డిసెంబర్ 31తో తన యాక్టింగ్ కెరీర్ ను ముగిస్తున్నట్టు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆశ్చర్యం నెలకొంది. 1967లో భార్య సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. తన సహజ నటనతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, భోజ్పురి భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి అరుదైన కెరీర్ను ఆమె సొంతం చేసుకున్నారు. ఇలా కొనసాగుతున్న తులసి కెరీర్ నుంచి ఇంత తొందరగా తన రిటైర్మెంట్ ప్రకటించబడుతుందని ఎవరూ ఊహించలేదు. […]