ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) కావాలని చేస్తుందో, లేక ఆమెకే అన్నీ అలా జరుగుతాయో తెలియదు కానీ.. కాంట్రవర్శీలు ఆమెకు స్నేహితులులానే ఉంటాయి. రీసెంట్‌గా సైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan) దాడి జరిగిన విషయం గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే.. ఆ సమయంలో ఆమె ఏదేదో మాట్లాడి పెద్ద పంచాయితీకి దారి తీసింది. అలా అని ఆమె సైఫ్ గురించి ఏమీ అనలేదు. ఆమె ఏదో అనుకుంది అంతే. ఇటీవల ఇంటర్వ్యూ కోసం ఓ విలేకరితో ఆమె మట్లాడుతుండగా ఆయన.. సైఫ్‌పై దాడి గురించి ప్రస్తావించారు.
Urvashi Rautela
అయితే ఆమె ఆ విషయం గురించి ఓ మాట చెప్పి.. మధ్యలో తాను ధరించిన ఆభరణాల గురించి చెబుతూ వెళ్లింది. ఆ వీడియో కాస్త బయటకు రావడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంలో ఆఖరికి ఊర్వశి సారీ చెప్పినా విషయం అక్కడితో ఆగలేదు. లేటెస్ట్ ఈ విషయంలో మరోసారి ఆమె స్పందించింది. ఊర్వశి షో ఆఫ్ చేస్తోందని.. అందుకే అలా మాట్లాడింది అని కొంతమంది ఆమె గురించి కామెంట్లు చేశారు. ఈ విషయం మీదే ఆమె స్పందించింది.
అలాంటి కామెంట్లు, ఘటనల తర్వాత మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని తాను గ్రహించానని చెప్పింది. సైఫ్‌పై దాడి అర్ధరాత్రి సమయంలో జరిగిందని, ఆ సమయంలో దాని గురించి నాకు పూర్తిగా సమాచారం లేదని, దాడి తీవ్రత కూడా తెలియదని చెప్పింది ఊర్వశి. ఆ రోజు ఉదయం 8 గంటల నుండి వరుస ఇంటర్వ్యూలు ఇచ్చానని, అందుకే సమాచారం లేక కాసేపు మాట్లాడి వేరే విషయాలను వచ్చేశానని ఊర్వశి చెప్పింది.
‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) సినిమా చూసిన తర్వాత తన తల్లిదండ్రులు ఆనందపడ్డారని, దాంతో కొన్ని ఖరీదైన కానుకలు ఇచ్చారని, వాటి గురించే ఆ ఇంటర్వ్యూలో చెప్పానని తెలిపింది. అంతేకానీ అది షో ఆఫ్ ఏ మాత్రం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఇప్పటికైనా ఈ పంచాయితీలు ఆగుతాయా చూద్దాం.