వరుసగా పెద్ద సినిమాలు సెట్ చేసుకుంటూ టాలీవుడ్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ గా పేరొందింది ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ’. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోల సినిమాలు ఈ బ్యానర్లో రూపొందుతున్నాయి. ‘గూఢచారి’ ‘వెంకీ మామ’ ‘ఓ బేబీ’ ‘కార్తికేయ2’ ‘ధమాకా’ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఈ బ్యానర్లో రూపొందాయి. అయితే ఇటీవల వచ్చిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
నాగ శౌర్య హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి మార్కులు పడ్డాయి. కానీ టికెట్లు తెగలేదు. మార్చి 17న విడుదలైన ఈ చిత్రం.. వీకెండ్ వరకు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఇక ఈ చిత్రం రిజల్ట్ పై తాజాగా విశ్వప్రసాద్ స్పందించారు.” ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రాన్ని మూడేళ్ళ క్రితం ప్రారంభించాం.
టీం అంతా బాగా కష్టపడింది. నాగ శౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో ‘ఊహలు గుసగుసలాడే’ ‘జ్యో అచ్యుతానంద’ వంటి సినిమాలు వచ్చి క్లాసిక్స్ గా నిలిచాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందుకున్నాయి. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు మేము చాలా ఎక్సయిట్ అయ్యాం. అందులో మంచి ఫీల్ ఉంది. కానీ జనాలకు ఆ ఫీలింగ్ కలగలేదు.
హీరో నాగ శౌర్య కూడా (PAPA) ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మంచి సినిమా తీశామని ఆనంద పడ్డాం. ఇక వెనక్కి తిరిగి ఫలితం చూసుకుంటూ బాధపడాల్సిన పనిలేదు అనిపిస్తుంది” అంటూ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!