Bandla Ganesh: బండ్ల గణేష్ కి అస్వస్థత.. హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స

టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత అయిన బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఈసారి హాస్పిటల్ లో ఉన్న ఫొటోతో వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సామజిక అంశాలపై కూడా బండ్ల గణేష్ ట్వీట్లు చేస్తూ ఉంటాడు. వాటికి బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ గురించి ఈయన చేసే కామెంట్స్ కూడా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి.

ఇక మైక్ పట్టుకుంటే బండ్ల గణేష్ (Bandla Ganesh) విశ్వరూపం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. కొన్ని గంటలుగా బండ్ల గణేష్ హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోని కనుక గమనిస్తే.. ఆయన చేతికి సెలైన్ కూడా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఉన్న బండ్ల గణేష్ ఫాలోవర్స్ ఆరాతీస్తూ ఈ టాపిక్ ను వైరల్ చేస్తున్నారు. విషయం ఏంటంటే.. బండ్ల గణేష్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారట.

వర్షాకాలంలో జ్వరాలు వస్తే ఓపిక తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వంటివి సాధారణంగా జరిగేవే. బండ్ల గణేష్ కి కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. అందుకే హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి ఇలా చికిత్స పొందుతున్నట్లు స్పష్టమవుతుంది. అయితే దీని పై బండ్ల గణేష్ ఎటువంటి క్లారిటీ ఇచ్చింది లేదు. సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టడం కూడా ఆపలేదు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus