Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?
- June 12, 2025 / 08:00 PM ISTByPhani Kumar
టాలీవుడ్లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో ‘గీతా ఆర్ట్స్’ ఒకటి. అల్లు అరవింద్ (Allu Aravind) ఈ బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందించారు. వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. కేవలం పెద్ద సినిమాలే కాకుండా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా చేయాలి అనే ఉద్దేశంతో.. ‘జిఎ2 పిక్చర్స్’ ను స్థాపించారు అల్లు అరవింద్ (Allu Aravind) . దీనిని బన్నీ వాస్ చేతిలో పెట్టారు. ఆ బాధ్యతని బన్నీ వాస్ (Bunny Vas) వందకి వంద శాతం కరెక్ట్ గా నిర్వర్తించారు.
Bunny Vas
అటు తర్వాత విద్యా కొప్పినీడి కూడా వచ్చి సహా నిర్మాతగా జాయిన్ అయ్యారు. ఇప్పుడైతే బన్నీ వాస్ (Bunny Vas) బయటకొచ్చి ‘మిత్ర మండలి’ అనే సినిమా చేశారు. దీని టీజర్ కూడా బయటకు వచ్చింది.ఇదిలా ఉంటే.. చాలా మంది ‘గీతా ఆర్ట్స్’ నుండి బయటకు వచ్చి బన్నీ వాస్ చేసిన మొదటి సినిమా ఇది అని అనుకుంటున్నారు.

కానీ ఈ సినిమా కోసమే బన్నీ వాస్ ‘గీత’ దాటారు అనేది ఇన్సైడ్ టాక్. బన్నీ వాస్ (Bunny Vas) కు ‘మిత్ర మండలి’ అనే కథ నచ్చింది. కానీ అల్లు అరవింద్ (Allu Aravind) కి నచ్చలేదు. ‘జిఎ2 పిక్చర్స్’ కి బన్నీ వాస్ నిర్మాతే అయినప్పటికీ.. అల్లు అరవింద్ (Allu Aravind) నుండి ఫైనల్ కాల్ వస్తేనే ప్రాజెక్టు ముందుకెళ్తుంది. లేదంటే లేదు. ‘మిత్ర మండలి’ కథ విషయంలో అల్లు అరవింద్ నో చెప్పారు అనేది ఇన్సైడ్ న్యూస్. మరోపక్క విద్యా కూడా ‘జిఎ2 పిక్చర్స్’ లో సహా నిర్మాతగా జాయిన్ అవ్వడం బన్నీ వాస్ ప్రైవసీని డిస్టర్బ్ చేసింది.

అందుకే బయటకు వచ్చి సొంత బ్యానర్ ను స్టార్ట్ చేశారు బన్నీ వాస్ (Bunny Vas). అతనికి ఓ బ్రాండ్ ఏర్పడింది. కాబట్టి అతను బడ్జెట్ పెట్టనవసరం లేదు. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ ‘సప్త అశ్వ మీడియా వర్క్స్’ వారు డబ్బు పెట్టారు. కానీ ప్రమోషన్ కానీ, బిజినెస్ కానీ బన్నీ వాస్ పేరుపై జరుగుతుంది. బన్నీ వాస్ (Bunny Vas) రూపాయి పెట్టకుండానే లాభాలు వస్తాయి. అది అతని స్ట్రాటజీ. మరోపక్క ‘గీతా ఆర్ట్స్’ ని కూడా అతను వదలడు. అతని బ్రాండ్ వాల్యూని తగ్గించుకోకుండా ఉండాలి అంటే.. ‘గీతా..’ సపోర్ట్ కూడా బన్నీ వాస్ (Bunny Vas) కి అవసరం. అందుకే రెండింటినీ బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలి అనేది అతని స్ట్రాటజీ. అది మేటర్.













