‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమాకి టికెట్ రేట్లు పెంచడం పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘స్టార్ హీరోల సినిమాలకు ఎలాగూ తప్పదు.. చిన్న సినిమాలకు కూడా ఎక్కువ రేట్లు పెట్టుకుని థియేటర్ కి వెళ్లాలా?’ అంటూ నిర్మాత నాగవంశీని (Suryadevara Naga Vamsi ) తిట్టుకుంటున్న బ్యాచ్ చాలా మంది ఉన్నారు. దీంతో ఈ విషయంపై అతను స్పందించి క్లారిటీ ఇచ్చాడు. నాగ వంశీ మాట్లాడుతూ… ” ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకి టికెట్ రేట్లు పెంపు అనేది ఇప్పుడు ఎక్కువ హాట్ టాపిక్ అయ్యింది.
చాలా మంది దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. మేము అన్ని ఏరియాల్లోనూ టికెట్ రేట్లు పెంచలేదు. ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో బాల్కనీ టికెట్ రేటు రూ.100 ఉంది. దాన్ని రూ.150 చేసుకోవడానికి .. రూ.50 హైక్ కోసం ప్రభుత్వాన్ని అనుమతి అడిగి తెచ్చుకున్నాం. సో ఎక్కడైతే సింగిల్ స్క్రీన్స్ లో రూ.150 టికెట్ రేటు ఉందో.. అక్కడ మేము టికెట్ రేట్లు పెంచడం లేదు. ఉగాది, రంజాన్ పండుగ సెలవులు ఉన్నాయి.
పైగా చాలా పెద్ద సినిమాల మధ్య మా సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో మాకు తక్కువ థియేటర్లు మాత్రమే దొరికాయి. అందుకే టికెట్ రేట్లు రూ.50 … అదీ కొన్ని ఏరియాల్లో పెంచుకున్నాం అంతే” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ‘నేనొక కామన్ ఆడియన్ గా రూ.200 పెట్టి కొంటే.. దానికి సంతృప్తి చెందే కంటెంట్ ‘మ్యాడ్ స్క్వేర్’ లో ఉంది అనేది నా నమ్మకం’ అనే కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేశాడు నాగవంశీ.