స్టార్ హీరో పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ సినిమాకు 60 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా రిలీజైన సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక హాలీవుడ్ సినిమాకు ఈ సినిమా కాపీ అని కూడా కామెంట్లు వినిపించాయి.
ప్రముఖ నిర్మాత నాగవంశీ అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ గురించి స్పందిస్తూ అజ్ఞాతవాసి సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ విషయంలో తప్పు చేశామని ఆ తప్పు జరిగిపోయిందని నాగవంశీ అన్నారు. ఆ తప్పు మళ్లీ పునరావృతం కాకూడదని తమ ఆలోచన అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ కారణం వల్లే భీమ్లా నాయక్ సినిమా సెట్స్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తీసుకొచ్చామని నాగవంశీ వెల్లడించారు. అజ్ఞాతవాసి విషయంలో జరిగిన తప్పును రిపీట్ చేయకూడదనేది తమ ఆలోచన అని ఆయన తెలిపారు.
ఆ బాధ్యత, భయం వల్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను సెట్స్ కు రావాలని ఆహ్వానించామని పవన్ అభిమానులకు తాము బాకీ ఉన్నామని ఆ బాకీ తీర్చుకోవాలని భావిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ ను తెరకెక్కించడం సులువు కాదని అయితే సాగర్ కె చంద్ర ఆ విషయంలో సక్సెస్ సాధించారని నాగవంశీ వెల్లడించారు. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25, ఏప్రిల్1 తేదీలలో ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదని నాగవంశీ కామెంట్లు చేశారు.
భీమ్లా నాయక్ మూవీ ఏప్రిల్ 1వ తేదీన రిలీజైనా ఆర్ఆర్ఆర్ కు తమ సినిమా పోటీ కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ రిలీజైన వారం తర్వాత తమ సినిమా రిలీజవుతుంది కాబట్టి తమ సినిమాకు కూడా థియేటర్లు దొరుకుతాయని నాగవంశీ వెల్లడించారు. నాగవంశీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. భీమ్లా నాయక్ సినిమాతో పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాలి.