Neha Shetty: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న.. క్షమాపణ చెప్పిన నిర్మాత!

డీజే టిల్లు సినిమా ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలైతే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక అదే సమయంలో మీడియా తో మాట్లాడిన చిత్ర యూనిట్ సభ్యులు ఎవరూ ఊహించని విధంగా ఒక చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వచ్చింది.

హీరోయిన్ విషయంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా ట్రైలర్ లో హీరోయిన్ పుట్టుమచ్చల కు సంబంధించి ఒక సీన్ హైలైట్ గా నిలిచింది. అయితే నిజంగానే హీరోయిన్ పుట్టుమచ్ఛల గురించి తెలుసుకున్నారా అంటూ విలేకరి అడిగిన ప్రశ్న అందరికీ చిరాకు తెప్పించింది. సినిమా హీరో సిద్ధూ వెంటనే ఆ ప్రశ్నను అవాయిడ్ చేద్దామని చాలా సున్నితంగా తిరస్కరించాడు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హీరోయిన్ నేహా శెట్టి కూడా స్పందించింది.

సదరు విలేకరి ఇలాంటి ప్రశ్న అడుగుతున్నపుడు అతను తన తోటి మహిళల ను ఏ విధంగా గౌరవిస్తాడో అర్థం చేసుకోవచ్చు అని చురకలు అంటించింది. ఇక ఆ తర్వాత ఆ విషయంపై నిర్మాత కూడా స్పందించక తప్పలేదు. ఇలాంటి చేదు అనుభవం ఎదురైనందుకు క్షమించండి అని , చాలా దురదృష్టకరం అని కూడా అన్నాడు. అయితే సోషల్ మీడియాలో సదరు జర్నలిస్టు పై నెటిజన్లు కామెంట్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు.

అనంతరం అతను సోషల్ మీడియా ద్వారా స్పందించి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే సమావేశంలో నిర్మాత కూడా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. డిజె సినిమా మీ బయోగ్రఫీ అనుకోవచా అని అడగడంతో అలాంటిది కాదు అని అంటూ.. అదే జరిగితే.. ఇలాంటి అందమైన అమ్మాయి ని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే నేనే నటిస్తాను అని చెప్పడం ఆశ్చర్యకరం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus