సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటే ఉన్నాయి. గతేడాది చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. కొత్త సంవత్సరంలో అప్పుడే టాలీవుడ్ ఫిమేల్ డైరెక్టర్ అపర్ణ మల్లాది మరణించిన సంగతి తెలిసిందే.అలాగే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, నిర్మాత అయినటువంటి ప్రభు సతీమణి కూడా మరణించారు. అలాగే అల్లు అర్జున్ పీఆర్ఓ, నటుడు అయినటువంటి ఏలూరు శ్రీను తల్లిగారు కూడా మరణించడం జరిగింది. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత ప్రీతిష్ నంది ఈరోజు మృతి చెందారు. ఆయన వయసు 73 ఏళ్లు అని తెలుస్తుంది. గుండెపోటు రావడంతో ఆయన ఇంట్లోనే ప్రీతీష్ కన్నుమూసినట్టు సమాచారం. ప్రీతిష్ నంది స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇది తనను తీవ్రంగా బాధ పెడుతుంది అని… ప్రీతిష్ నంది ఒక అద్భుతమైన రచయిత, కవి,ఫిలిం మేకర్ అని చెప్పుకొచ్చారు. ప్రీతీష్ జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు.
అంతేకాదు ప్రీతీష్ పొలిటికల్ గా కూడా… 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. అనేక సిరీస్..లకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక ప్రీతీష్ నంది మృతి పట్ల చింతిస్తూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.