కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రవీందర్ చంద్రశేఖరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గత ఏడాది సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకొని పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక ఈ ఇద్దరికి ఇది రెండవ వివాహం కావటం గమనార్హం ఇలా వీరి వివాహం తర్వాత ఈ జంట ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇకపోతే తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉండే ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
నిర్మాత రవీందర్ (Ravinder) చీటింగ్ కేసులో భాగంగా అరెస్టు కావడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఓ వ్యక్తి దగ్గర రవీందర్ ఓ ప్రాజెక్ట్ పెట్టుబడిలో భాగంగా 16 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి తనకు చెల్లించకపోవడంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసులు నిర్మాత రవీందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి వద్ద రవీందర్ 16 కోట్ల రూపాయలను తీసుకొని తనని మోసం చేశారు అంటూ ఈయన గత కొద్ది రోజుల క్రితం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా రవీందర్ మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ ను ఇంధనంగా మార్చే రూ.200 కోట్ల విలులైన ప్రాజెక్టులో పెట్టుబడి కోసం రవీంద్రన్ తనను సంప్రదించగా ఆయన ఏకంగా 16 కోట్ల రూపాయలు ఇచ్చానని అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని బాలాజీ పేర్కొన్నారు.
ఇలా ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో తాను ఇచ్చినటువంటి 16 కోట్ల రూపాయలను తనకు వెనక్కి తిరిగి చెల్లించాలని తాను రవీందర్ ను కోరగా ఆయన మాత్రం డబ్బు తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా తనని బెదిరింపులకు గురి చేస్తున్నారు అంటూ బాలాజీ పోలీసుల ఫిర్యాదుల పేర్కొన్నారు. ఇక ఈయన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రవీందర్ ను అరెస్టు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.