చిరంజీవికి ఏమైంది? గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఇదే చర్చ జరుగుతోంది. ఆయనకు ఆరోగ్యం బాలేదని కొందరు, ఏదో సర్జరీ జరిగిందని ఇంకొందరు, చిన్న సమస్య అని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో చిరంజీవి టీమ్ క్లారిటీ ఇవ్వడం లేదు. అలా అని ఖండించడం కూడా లేదు. దీంతో లేనిపోని చర్చలకు కారణమవుతోంది. దీనికితోడు మంగళవారం జరిగిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిర్మాతల ప్రెస్‌మీట్‌లో ఈ విషయంలో వచ్చిన రెస్పాన్స్. చిరు తనయ సుస్మిత ఎటూ కాని సమాధానం ఇచ్చారు. మరోవైపు రామ్‌చరణ్ బిర్యానీ పార్టీలో చిరు కనిపించలేదు. ఇవన్నీ కలిపి రూమర్లు పెద్దవయ్యాయి.
అయితే, ఈ చర్చలు అన్నింటికీ ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దానికి చిరంజీవి, వెంకటేశ్ వస్తారని టీమ్ అనౌన్స్ చేసింది. మరి ఆ ఈవెంట్‌కి చిరు ఎలా వస్తారు? వచ్చాక ఏం మాట్లాడతారు? తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లపై స్పందిస్తారా? తన కొత్త సినిమా (బాబీ డైరక్షన్‌లో చేసే 158వ మూవీ) వాయిదా పడుతుంది అనే వార్తలపై కూడా క్లారిటీ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదంతా ఓకే కానీ.. చిరంజీవి శస్త్ర చికిత్స జరిగిందంటూ వస్తున్న వార్తలపై సుస్మిత స్పందిస్తూ.. దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయను అని చెప్పారు. నాన్న పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఓవర్సీస్ అభిమానులతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తారు. గతంతో పోలిస్తే ఆయన ఫిట్‌నెస్ పెంచారు. అందుకే స్క్రీన్‌పై స్పెషల్ లుక్‌లో కనిపిస్తున్నారు అని చెప్పారు. అయితే శస్త్రచికిత్స జరగలేదు అని కానీ, ఆయన అంతా బాగానే ఉన్నారు అని కానీ ఆమె అనలేదు. దీంతో ఈ రూమర్లు పెద్దవయ్యాయి. చూద్దాం ఈ రోజు ఆయన ఈవెంట్‌కి వచ్చి క్లారిటీ ఇస్తారేమో.
