Puneeth Rajkumar: పునీత్ దర్శకనిర్మాతల పరిస్థితి ఏమవుతుందో..!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సడెన్ గా చనిపోవడంతో చాలా మందికి బాధను మిగిలిస్తే.. బాక్సాఫీస్ కి మాత్రం భారీ నష్టాన్ని మిగిల్చేలా ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ విలువ దాదాపు రూ.400 కోట్లకు పైమాటే. పునీత్ ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ‘జేమ్స్’, ‘ద్విత్వ’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ఒక్కో దానికి యాభై నుంచి 60 కోట్ల రూపాయల బడ్జెట్ ను అనుకుంటే రెండు సినిమాలకు కలిసి వంద నుంచి 120 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది.

ఇప్పుడు ఇవి సగంలోనే ఆగిపోతాయి. మరి ఈ చిత్ర దర్శకనిర్మాతల పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఇక పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా కూడా సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఐదు సినిమాలు ఆయన బ్యానర్ లో ప్లాన్ చేసుకుంటున్నారట. మినిమం అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో మార్కెట్‌ యావ‌రేజ్‌గా వేసుకున్నా.. అవ‌న్నీ క‌లిపితే రూ.300 కోట్ల‌కు పైగానే మార్కెట్‌పై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. అంటే మొత్తం కలుపుకుంటే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల సినిమా బిజినెస్ ప్రశ్నార్ధకంగా మారింది.

ఆయన సినిమాలను నమ్ముకున్న దర్శకనిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నటుడిగానే కాకుండా ఎంతోమందికి సేవలు చేసి మహానుభావుడయ్యాడు. ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి సినీ తారలంతా బెంగుళూరు చేరుకుంటున్నారు. పునీత్ ని ఆఖరి చూపు చూసుకొని నివాళులు అర్పిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus