Puri, Vijay: ‘జేజీఎం’ సంగతేమో కానీ.. ఇవి తేలాలి!

  • September 2, 2022 / 08:16 PM IST

‘లైగర్‌’ సినిమా ఫలితం తేలినప్పటి నుండి… అంతటా వినిపిస్తున్న మాట ‘జేజీఎం’ ఉంటుందా? ఎందుకంటే ‘లైగర్‌’ కొట్టిన దెబ్బ అలాంటిది. ‘దేశాన్ని షేక్‌ చేస్తాం’ అంటూ దిగిన పూరి జగన్నాథ్‌ – ఛార్మి – విజయ్‌ దేవరకొండ పూర్తిగా షేక్‌ అవుతున్నారు. సినిమాలో విజయ్‌ పడ్డ కష్టానికి పేరొస్తున్నా, సినిమా ఫలితం తేడొ కొట్టేసింది. ఇందులో తప్పు ఎవరిది అనే విషయం ఇంతకుముందే మనం చదవుకున్నాం. ‘జేజీఎం’ అలియాస్‌ ‘జన గణ మన’ ఉంటుందా అనేది కూడా చదువుకున్నాం.

అయితే, ఇప్పుడు మనం చర్చించబోయేది ‘జేజీఎం’ ఒకవేళ ఉంటే.. ఎప్పడు ఉంటుంది. ఈలోపు పూరి, విజయ్‌ ఏం చేయాలి అనేది చూద్దాం. ఎందుకంటే ‘లైగర్‌’ కోసం వీరిద్దరూ చాలా సమయం తీసుకున్నారు. దీంతో గతంలో అనుకున్నవి, అనౌన్స్‌ అయినవి చాలా సినిమాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో పూరి, విజయ్‌ అర్జెంట్‌గా వాటి మీద దృష్టి పెట్టాల్సి ఉంది. అవేంటి, ఎవరికి ఏ సినిమా చేయాల్సి ఉంది అనేదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌.

దిల్‌ రాజుకు విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేయాల్సి ఉంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా అనౌన్స్‌ చేశారు కానీ ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో ఇప్పుడు చేస్తున్న ‘ఖుషీ’ తర్వాత విజయ్‌ ఆ సినిమా చేయాల్సి ఉంది అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు ‘హీరో’ అని ఓ సినిమా అనౌన్స్‌ చేసి స్టార్ట్‌ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో ‘ఖుషీ’ సినిమాను వాళ్ల దగ్గర చేస్తున్నాడు విజయ్‌. దీంతో దిల్‌ రాజుకు ఓ సినిమా బాకీ పడ్డాడు.

దిల్‌ రాజు – విజయ్‌ దేవరకొండ సినిమా అనుకున్నప్పుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటిని దర్శకుడు అనుకున్నారు. మరిప్పుడు చేస్తే ఎవరు దర్శకుడు అవుతారో చూడాలి. ఇక పూరి సంగతి చూస్తే.. ఆయన ఇమ్మీడియట్‌ ప్రాజెక్ట్‌ అంటూ ఏమీ లేదు. ‘లైగర్‌’ ప్రచారంలో ఆ సినిమా చేస్తా, వీళ్లతో చేస్తా అని చెప్పడమే తప్పా ఎక్కడా కన్‌ఫామ్‌ ప్రాజెక్ట్‌ లేదు. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌, రణ్‌వీర్‌ ఇలా చాలా పేర్లే వినిపించాయి.

ఇక ‘జేజీఎం’ ఆగిపోతే ఏం అవుతుంది అనే విషయంలోనూ ఓ చర్చ నడుస్తోంది. ‘జేజీఎం’ సినిమాలో మై హోమ్‌ సంస్థ నిర్మాణ భాగస్వామి. ఎక్కువ షేర్‌ కూడా వాళ్లకే ఉంది అంటున్నారు. దీంతో పూరి ‘ఇస్మార్ట్‌ శంకర్‌ 2’ సినిమాను వాళ్లతో చేయాలని ఓ ఆలోచన అట. అలాగే విజయ్‌ కూడా మైహోమ్‌ వాళ్లకు ఓ సినిమా చేస్తాడట. దీంతో బాకీ తీరిపోతుంది అని అంటున్నారు. ఇప్పటికే ‘జేజీఎం’ కోసం రూ. ఐదు కోట్లు ఖర్చయిందని కొందరు, కాదు కాదు రూ. 20 కోట్లు ఖర్చయిందని మరికొందరు అంటున్నారు. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus