Pavithra Puri Jagannadh: పూరి ఫోర్స్ చేయడంతో నటించిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా చెలామణి అవుతున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. కొంతకాలం పాటు ఫ్లాప్ లతో ఇబ్బంది పడిన ఈ డైరెక్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అప్పటినుంచి తన జోరు చూపిస్తున్నాడు. మరోపక్క తన కొడుకు ఆకాష్ పూరి కెరీర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఆకాష్ నటించిన ‘రొమాంటిక్’ సినిమాకి కథ-మాటలు-స్క్రీన్ ప్లే పూరి జగన్నాథ్ అందించారు. ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు ఆకాష్ పూరి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆకాష్ తన సోదరి పవిత్ర టాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. త్వరలోనే పవిత్ర కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ‘బుజ్జిగాడు’ సినిమాలో పవిత్ర చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించింది. దీంతో ఆమె మళ్లీ నటిగా వెండితెరపై కనిపిస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే పవిత్రకు నటన మీద అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు ఆకాష్ పూరి.

‘బుజ్జిగాడు’ టైంలో కూడా నాన్నగారు ఫోర్స్ చేయడం నటించిందే తప్ప.. తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. తన సిస్టర్ కి నిర్మాణ రంగంలోకి రావాలని ఎంతో ఆశగా ఉన్నట్లు ఆకాష్ చెప్పారు. కొన్నేళ్లలో పవిత్ర నిర్మాతగా అడుగులేసే ఛాన్స్ ఉందని అన్నారు. మరి పవిత్ర సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెడుతుందో లేక తండ్రి బ్యానర్ పనులు చూసుకుంటుందో తెలియాల్సివుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus