పుష్ప 2: ది రూల్ ((Pushpa 2) సినిమాకు సంబంధించిన బిజినెస్ దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా కర్ణాటక మార్కెట్‌లో ఈ చిత్రానికి ఎక్స్ ట్రార్డినరీ డీల్ కుదిరింది.
Pushpa 2
కర్ణాటకలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 30 కోట్ల నాన్-రిఫండబుల్ డీల్‌తో అమ్ముడైనట్లు సమాచారం. ఈ మొత్తానికి అదనంగా ప్రొమోషన్ ఖర్చులు, థియేట్రికల్ షేర్ లెక్కలతో మొత్తం డీల్ విలువ రూ. 33.50 కోట్లుగా నిలిచింది. అంటే, ఈ మార్కెట్లో బ్రేక్ ఈవెన్ చేరాలంటే సినిమా కనీసం 34 కోట్ల షేర్ అందుకోవాలి. పుష్ప ఫ్రాంచైజ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ టార్గెట్ చేరడం పెద్ద విషయం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
కర్ణాటకలో బన్నీ క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. మొదటి భాగం అక్కడ భారీ వసూళ్లను రాబట్టినప్పటికీ, పుష్ప 2 విషయంలో బిజినెస్ స్థాయి మరింత పెరిగింది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో కర్ణాటక మార్కెట్లో హైయెస్ట్ రైట్స్ డీల్ కావడం విశేషం. ఆర్ఆర్ఆర్ (RRR) , కేజీఎఫ్2 (KGF 2) సినిమాల తరహాలోనే పుష్ప 2 కూడా అక్కడ భారీ కలెక్షన్లు సాధించే అవకాశముంది. హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా బిజినెస్ రేంజ్ అద్భుతంగా ఉంది.
మొదటి రోజు హిందీ వర్షన్ నుంచి 70-80 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ కల్లా 200 కోట్ల గ్రాస్ అందుకోవచ్చని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తే పుష్ప ఫ్రాంచైజ్ ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. సుకుమార్ ఈ సినిమాకు ప్రత్యేకమైన శ్రద్ధతో పని చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచింది.