Pushpa 2: పుష్ప సెకండ్ మొదలయ్యేది అప్పుడే!

ఈ ఏడాది రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప ఇలాంటి విజయం అందుకుంటుంది అనేది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే అఖండ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక అదే తరహాలో పుష్ప సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటేనే ఓపెనింగ్స్ భారీస్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.

కానీ మిగతా భాషలో ఎలా ఉంటుంది అనే పరిస్థితి పై విడుదలయ్యే వరకు కూడా ఎలాంటి క్లారిటీ రాదనే చెప్పాలి.పుష్ప సినిమాను మొదట దర్శకుడు రెండు భాగాలు కాకుండా ఒకే భాగంలో పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ నిడివి ఎక్కువ రావడంతో రెండు భాగాలుగా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఇక రెండవ భాగం షూటింగ్ కూడా కొంత బ్యాలెన్స్ ఉంది అయితే షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి భాగం కోసం నిర్మాతలు 190కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

అయితే సెకండ్ పార్ట్ కోసం మాత్రం ప్రస్తుతం అనుకున్నంతగా అయితే ఖర్చు చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పుష్ప పార్ట్ 1 రిజల్ట్ ను బట్టి సెకండ్ పార్ట్ ను తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే దేవి శ్రీప్ర సాద్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకుండా సినిమా వర్క్ లో నిమగ్నమయ్యారు. వచ్చే శుక్రవారం సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

అందుకే ఈ 5 రోజుల్లోనే ఫైనల్ మిక్సింగ్ లో చిన్న పొరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ సమయంలో సుకుమార్ తో పాటు దేవిశ్రీప్రసాద్ కూడా రెగ్యులర్ ప్రమోషన్ లో ఉండాలి. కానీ వర్క్ లోనే వారు బిజీగా ఉండడం వలన మిగతా భాషల్లో ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. మరి అల్లు అర్జున్ సోలోగా సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus