అల్లు అర్జున్వి(Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) జయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకుంది.3వ వారం డౌన్ అయినా క్రిస్మస్ హాలిడే ఈ సినిమాకి కలిసొచ్చింది. అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం వల్ల ఆడియన్స్ కొంచెం డైవర్ట్ అయినట్టు అయ్యింది. నార్త్ లో మాత్రం ‘పుష్ప 2’ ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో నష్టాలు తప్పేలా లేవు అనే చెప్పాలి.
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.662.62 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా రూ.57.62 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.