Pushpa Movie: ‘పుష్ప 2’కి ‘పుష్ప 1’ పెట్టిన ఇబ్బంది తెలుసా?

ఓ సినిమా విజయం, వసూళ్లు, టాక్‌, పొగడ్తలు తర్వాతి సినిమాకు మంచి బజ్‌ తీసుకొస్తుంది. ఆ సినిమా ఓపెనింగ్స్‌కు బాగా పనికొస్తుంది. అయితే ఓ సినిమా సాధించిన విజయం, దాని రెండో పార్టుకు ఇబ్బందులు తెస్తుంది అంటే నమ్ముతారా? ‘పుష్ప’ పార్ట్‌ 2 పరిస్థితి చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. అవును… ‘పుష్ప’ పార్ట్‌ 1 సాధించిన విజయం వల్ల బన్నీ సినిమాల లైనప్‌ మారిపోతోందని టాక్‌. రెండో పార్టుపై ఇంకాస్త సమయం వెచ్చించాలి అనుకోవడమే దానికి కారణం అంటారు.

‘పుష్ప – ది రైజ్‌’కి సంబంధించి సినిమా విడుదలైనప్పటి నుండి వరుస ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్నారట. వాటన్నింటిని క్రోడీకరించి, వీలైనంత త్వరగా టీమ్‌ అంతా మరోసారి స్టోరీ బోర్డు మీద కూర్చోవాలని అనుకుంటుందోట. మరోసారి పక్కాగా ఫిక్స్‌ చేసుకొని రెండో పార్టు సినిమా షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారట. నిజానికి ఫిబ్రవరిలోనే రెండో పార్టు షూటింగ్‌ మొదలవుతుందని ఆ మధ్య వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు చిత్రబృందం ప్లాన్‌ మారిందట. గతంలో అనుకున్న 100 రోజుల డెడ్‌లైన్‌ను పక్కనపెట్టి సినిమాకు మరింత పకడ్బందీగా సిద్ధం చేయాలని చూస్తున్నారట. తొలి పార్టులో అక్కడక్కడ వచ్చిన ల్యాగ్‌, అవసరం లేని సన్నివేశాలు, లాజిక్‌ లేని సన్నివేశాలు వంటి వాటిని పక్కనపెట్టి కొత్త పార్టు సిద్ధం చేస్తారట. తొలి పార్టులో చాలా ప్రశ్నలు వదిలేశారు. వాటన్నింటికి రెండో పార్టులో సమాధానలు చెప్పాల్సిందే.

ఈ లెక్కన రెండో పార్టును డీల్‌ చేయడం అంత ఈజీ కాదు. తొలి పార్టు క్లైమాక్స్‌ విషయంలో ప్రేక్షకులు, అభిమానుల్లో కాస్త పెదవివిరుపు ఉన్న మాట వాస్తవమే. ఇంకాస్త పటిష్ఠంగా, పవర్‌ఫుల్‌గా ఆ సీన్స్‌ రాసుకోవాల్సింది అని అందరూ అనుకుంటున్నారు. ఈ మాటలు ఆ నోట, ఈ నోట పడి అలా సుకుమార్ – బన్నీ వరకు చేరాయని టాక్‌. మరోవైపు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమల్లో సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. సరైన ప్రచారం లేకపోయినా అక్కడ వసూళ్లు రావడంతో, రెండో పార్టుతో గట్టిగా ప్రచారం చేసి మరిన్ని వసూళ్లు సాధించాలని చూస్తున్నారట.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్టైల్‌లో భారీ స్థాయిలో ప్రచారం చేయాలంటే చాలా రోజుల సమయం అవసరమవుతుంది. షూటింగ్‌ + ప్రచార సమయం కాన్సెప్ట్‌ను లెక్కలోకి తీసుకొని చూస్తే సినిమా అనుకున్నట్లు సమ్మర్‌కి రావడం కష్టమే అంటున్నారు నిపుణులు. ఆ లెక్కన దసరాకి కానీ, లేదంటే వచ్చే ఏడాది ఆఖరులో కానీ సినిమా విడుదలవ్వొచ్చు అని టాక్‌. దీంతో ‘పుష్ప 2’ తర్వాత సినిమా మొదలుపెట్టేద్దాం అనుకుంటున్న బోయపాటి శ్రీనుకు ఇప్పట్లో కష్టమే అని తెలుస్తోంది. 2022 ఆఖర్లో కానీ, 2023 మొదట్లో ఆ సినిమా స్టార్ట్‌ అవ్వొచ్చని సమాచారం. ‘ఐకాన్‌’ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus