పుష్ప 2 (Pushpa 2: The Rule) ముగింపు కంటే ముందు నుంచే పుష్ప 3పై (Pushpa 3) ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందనే విషయమై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ 2027 మిడ్ లో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వేసవిలో ప్రారంభం కానుంది.
అయితే, త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ సినిమాలకు దాదాపు ఏడాదిన్నర టైమ్ పడుతుండటంతో పుష్ప 3 (Pushpa 3) కోసం ఫ్యాన్స్ చాలా కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సుకుమార్ విషయానికొస్తే, పుష్ప 2తో భారీ స్థాయిలో మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాలను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో (Ram Charan) ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు.
ఇది పూర్తిగా నూతన కథాంశంతో, చరణ్‌కు జాతీయ అవార్డు తెచ్చేలా ఉండే చిత్రంగా రూపొందించనున్నారని సమాచారం. ఈ సినిమా 2025లోనే ప్రారంభం కావొచ్చని భావిస్తున్నారు. ఇక పుష్ప 3 విషయానికి వస్తే, ఈసారి సుకుమార్ (Sukumar) మరింత పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారట. రెండో భాగం పాన్ ఇండియాలో ఓ సెన్సేషన్‌గా మారిన నేపథ్యంలో, మూడో భాగాన్ని అంతకంటే అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
అందుకే, ఇప్పుడే స్క్రిప్ట్ పనులు ప్రారంభించినా, పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరో రెండేళ్ల వరకు టైమ్ తీసుకునేలా ఉన్నట్లు టాక్. మొత్తానికి పుష్ప 3 త్వరలోనే రాబోతోందని అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఈ లేటెస్ట్ అప్‌డేట్ కొంత నిరాశ కలిగించవచ్చు. కానీ బన్నీ, సుకుమార్ లాంటి క్రేజీ కాంబినేషన్ తిరిగి రీ-యూనైటయ్యే లోపు, మరో రెండు భారీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంటే పుష్ప 3 మినిమం 2027 వరకూ ఆగాల్సిందే.