Anshvi Reddy: పుష్ప మూవీ ఫేమ్ అనష్వి రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్ పిక్స్ వైరల్..!

2021 ఎండింగ్ లో విడుదలైన అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’.. ఆ ఏడాదికి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో…తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ మూవీ.. హిందీలో ఏకంగా రూ.108 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.ఈ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. అల్లు అర్జున్, రష్మిక లతో పాటు ఈ మూవీలో నటించిన నటీనటులందరికీ మంచి అప్లాజ్ లభించింది.

ముఖ్యంగా హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అనష్వి రెడ్డి పాత్ర అందరినీ ఎంటర్టైన్ చేసిందనే చెప్పాలి. ఈ అమ్మడు అందరి మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ‘అన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు’ ‘టిఫిన్ చేసాడు కనిపిస్తుంది కదా’ అనే డైలాగులతో ఈమె తెగ నవ్వించింది. ఈ సినిమా కోసం రష్మిక కి చిత్తూర్ స్లాంగ్ నేర్పింది కూడా ఈ అమ్మాయే.బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు.

పుష్ప2 కి కూడా ఈమె (Anshvi Reddy) రష్మిక కి మళ్లీ చిత్తూరు స్లాంగ్ నేర్పించాల్సి ఉంది . ఇక పుష్ప లో ఈమె కాస్త బొద్దుగా కనిపించింది. అయితే కేవలం ఈ పాత్ర కోసమే అనష్వి కొంచెం వెయిట్ పెరిగింది. నిజానికి ఈమె అంత వెయిట్ ఉండదట. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టిివ్. ఈరోజు ఈమె పుట్టిన రోజు కావడంతో తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus