Kalpalatha: ఘనంగా పుష్ప నటి కూతురు నిశ్చితార్థపు వేడుక!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే సీనియర్ సెలబ్రిటీలు వారి పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా మరికొందరు నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చెల్లెలు కూడా పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. అల్లు అర్జున్ చెల్లెలు లేరు కదా పెళ్లి చేసుకోవడమేంటి అనే విషయానికి వస్తే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో తనకు తల్లి పాత్రలో నటించినటువంటి కల్పలత కూతురి నిచ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

దీంతో అల్లు అర్జున్ చెల్లెలు నిశ్చితార్థం అంటూ ఈ వీడియోని వైరస్ చేస్తున్నారు.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి తల్లి పాత్రలో నటి కల్ప లత నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు తనకంటే అల్లు అర్జున్ కేవలం రెండు సంవత్సరాలు చిన్నవాడు అనే విషయం తెలిసి అల్లు అర్జున్ చాలా ఆశ్చర్యపోయారని తెలిపారు.

అయితే ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వీరిద్దరూ కూడా విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారని కల్పలత గతంలో తెలిపారు. ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె నిశ్చితార్థపు వేడుకలను ఎంతో ఘనంగా చేశారంటూ తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ నిశ్చితార్థానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా ఈ నిశ్చితార్థపు వేడుకలలో పాల్గొన్నారని తెలుస్తుంది. ఇక ఈమె (Kalpalatha) ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus