సాధారణంగా డైరెక్టర్లు రెండు రకాలు ఒక టైపు వాళ్ళు కధ రాసుకుని సినిమా తీస్తారు, రెండో టైపు వాళ్ళు సినిమా తీస్తూ కధ రాస్తారు, కానీ మన లెక్కలు మాస్టారు సుకుమార్ మూడోరకం ఈయన స్పాట్ లో కంటే ఎడిట్ రూమ్ లోనే ఎక్కువ డైరెక్షన్ చేస్తాడు, ఎడిట్ రూమ్ డైరెక్టర్ ని అని ఈ క్రియేటివ్ డైరెక్టర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ అలవాటే ఇప్పుడు నిర్మాతలకు భారంగా కూడా మారుతుందని స్పష్టమవుతుంది.
విషయం ఏంటంటే.. 2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ కమర్షియల్ హిట్ అనిపించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో అది కూడా ఆంధ్రలో తప్ప విడుదలైన మిగిలిన భాషలన్నింటిలోనూ బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా అక్కడి బయ్యర్లకి మంచి లాభాల్ని కూడా అందించింది ‘పుష్ప’ చిత్రం. అయితే ‘పుష్ప’ పార్ట్ 1 కి సుకుమార్ దాదాపుగా రూ.180 కోట్లు ఖర్చు పెట్టించాడు. కాకపోతే ఈ సినిమాలో వేస్టేజీ చాలా ఉందని తెలుస్తుంది.
ఫైనల్ కాపీ రెడీ అయ్యే సరికి ఇందులో చాలా సన్నివేశాల్ని సుకుమార్ డిలీట్ చేసాడట. ఇలా ఎడిటింగ్ లో చాలా కాస్ట్లీ సీన్లు లేపేసాడట.వాటి విలువ దాదాపు రూ.12 కోట్లని ఇన్సైడ్ టాక్. ఈ డిలీటెడ్ వెర్షన్లో ఓ భారీ యాక్షన్ సీన్ ఎపిసోడ్ కూడా ఉందట. ఏదేమైనా ఈ రూ.12 కోట్ల బడ్జెట్ తో రెండు మూడు చిన్న సినిమాలు తీసెయ్యొచ్చు అనేది ఇండస్ట్రీ మాట.అయినా పెద్ద సినిమా అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ‘పుష్ప’ కి రోజుకి రూ.30 లక్షలు పైనే ఖర్చు అయ్యిందని అంచనా..!