Pushpa Collections: పుష్ప హిందీ కలెక్షన్స్.. మొదటిరోజు ఎంతంటే

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరపైకి వచ్చిన బిగ్ బడ్జెట్ ఫ్యాన్ ఇండియా సినిమా పుష్ప శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ముత్తం శెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారు. ఇక మొదటి పుష్ప తెలుగు గడ్డపై గట్టిగానే అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ సినిమా చిత్ర పరిశ్రమలో

బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న టాప్ టెన్ లిస్టులో కూడా పుష్ప సినిమా చేరుకుంది అయితే ఈ సినిమా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలు అయితే పుష్ప సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా విడుదల చేయాలని అనుకున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వలన టైమ్ దొరకలేదు.

అనుకున్నంత స్థాయిలో సినిమాలు హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్ళలేకపోయారు. అయినప్పటికీ కూడా సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. చిత్ర నిర్మాతలు హిందీ కలెక్షన్స్ విషయంలో చాలా సంతోషం గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా మొదటి రోజు హిందీలో 3.05కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అనుకున్నట్లు సమాచారం. హిందీలో అసలు ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు అసలు ఊహించలేట.

ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాల ప్రభావం వలన ఓపెనింగ్ అయితే చాలానే వచ్చాయి. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా హిందీలో ఇంకాస్త ప్రమోషన్స్ పెంచితే మరిన్ని వసూళ్లు అందుకునే అవకాశం ఉంటుంది. శనివారం ఆదివారం కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus