Samantha Song: ‘పుష్ప’ ఐటెమ్‌ డీఎస్పీకి చుక్కలు చూపిస్తోందా?

దేవిశ్రీప్రసాద్‌, తమన్‌… వీళ్లిద్దరి నుండి ఏదైనా సినిమా పాట బయటికొస్తే చాలు… అది ఏ సినిమాలో పాటకు కాపీ అంటూ వెతికేయడం మొదలెట్టేస్తారు. అంత నమ్మకం నెటిజన్లకు ఆ ఇద్దరి మీద. తాజాగా దేవిశ్రీప్రసాద్‌ ఇలాంటి పరిస్థితి ఎందుర్కటున్నారు. నెటిజన్లు అదే నమ్మకంతో వెతికి కాపీ ఒక పాట నుండి కాదు… రెండు పాటల నుండి అని లెక్క చెప్పేస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. దీనంతటికి కారణం ‘ఉ అంటావా… ఊ ఊ అంటావా…’ అంటూ సమంత చేసిన పాట.

సుకుమార్‌ – అల్లు అర్జున్‌ – దేవిశ్రీప్రసాద్‌ కాంబినేషన్ అంటే ఐటెమ్‌ సాంగ్‌ మ్యాజిక్‌ మినిమం ఉంటుంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ లో ఇలాంటి పాటలు చూశాం. ఇప్పుడు ‘పుష్ప’లో ఎలా ఉంటుందో అనుకుంటే… కుర్రాళ్లను సమంత ‘ఉఊ’ అంటూ ఊపించేసింది. అయితే ట్యూన్‌ విషయంలోనే అసలు సమస్య. ఆ పాట వింటుంటే ఎక్కడో విన్నట్లుందే అనిపిస్తోంది. అలా ఒక పాట కాదు రెండు పాటలు మైండ్‌లో స్ట్రైక్‌ అవుతున్నాయి. దీంతో డీఎస్పీని సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటున్నారు.

సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమాలో ‘హానీ హానీ…’ అనే సాంగ్ గుర్తొస్తుందని కొందరు అంటున్నారు. మరికొంతమంది అయితే ‘రంగం’ సినిమాలోని ‘అగ నగ నగ..’ అనే పాట గుర్తొస్తోందని అంటున్నారు. రెండు ‘ఉ అంటావా…’ అనే పాట వింటుంటే ఆ రెండు పాటల ట్యూన్స్‌, ఫీల్‌ను కలిపి వింటున్నట్టుగా ఉంది అంటున్నారు నెటిజన్లు. పాటలో స్టెప్పులు, అందాలు అదిరిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇలాంటి కాపీ కామెంట్లు లేకుండా ఉంటే బాగుండు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus