Allu Arjun: బన్నీ తరువాత ప్రాజెక్ట్ గురించి క్లారిటీ వచ్చినట్టే!

గత కొన్ని నెలలుగా బన్నీ తర్వాత ప్రాజెక్ట్ గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఐకాన్ సినిమాలో బన్నీ నటించే అవకాశం ఉందని, బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. బన్నీ సైతం తరువాత ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ సైతం గందరగోళానికి గురవుతున్నారు. అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బన్నీ తర్వాత ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు.

బన్నీ పుష్ప2 సినిమాలో ఫిబ్రవరి నుంచి నటించనున్నారని మైత్రీ మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో బన్నీ నటించాల్సిన ఐకాన్ మూవీ దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే పుష్ప పార్ట్2 కు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ ను పూర్తి చేశారు. పుష్ప పార్ట్1కు పార్ట్2కు మధ్య గ్యాప్ వస్తే ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడే అవకాశం ఉంది.

జనవరి చివరి వారం వరకు బన్నీ విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. పుష్ప లుక్ కోసం బన్నీ జుట్టు, గడ్డంను కొనసాగిస్తాడని పుష్ప2 తర్వాతే బన్నీ తర్వాత ప్రాజెక్ట్ ను ప్రకటిస్తాడని తెలుస్తోంది. దాదాపుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప పార్ట్1 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. బన్నీ తర్వాత సినిమా డైరెక్టర్ల జాబితాలో కొరటాల శివ కూడా ఉన్నారు.

పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో మాత్రమే నటించాలని అల్లు అర్జున్ అనుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని బన్నీ భావిస్తున్నా జక్కన్న నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. బన్నీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చినా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బన్నీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus