Sukumar: ఎక్కువ ఫుటేజ్ తీసి సుక్కూ తప్పు చేశారా?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఏకంగా 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పుష్ప ది రైజ్ సినిమా తెరకెక్కింది. అయితే ఆ స్థాయి ఖర్చుకు తగిన క్వాలిటీ సినిమాలో మాత్రం కనిపించలేదని కామెంట్లు వినిపించాయి. పుష్ప ది రైజ్ బడ్జెట్ లో దాదాపుగా సగం రెమ్యునరేషన్ల కోసమే ఖర్చు చేశారని సమాచారం. సాధారణంగా దర్శకులు తెరకెక్కించిన సన్నివేశాలలో కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో కట్ అవుతాయి. స్టార్ డైరెక్టర్ల సినిమాలకు ఈ వేస్టేజ్ ఎక్కువగానే ఉంటుంది.

అయితే పుష్ప సినిమాకు సంబంధించి పక్కన పుట్టిన ఫుటేజ్ నిర్మాణపు విలువ ఏకంగా 30 కోట్ల రూపాయలు అని సమాచారం. డైరెక్టర్ సుకుమార్ అవసరమైన సీన్లను మాత్రమే తెరకెక్కించి ఉంటే నిర్మాతలకు 30 కోట్ల రూపాయల ఖర్చు తగ్గడంతో పాటు టాక్ తో సంబంధం లేకుండా పుష్ప ది రైజ్ సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది. ఈ సినిమాలోని ఊ అంటావా ఊహూ అంటావా పాట ఫుటేజ్ కూడా ఎక్కువేనని సమాచారం.

ఆ పాటకు సంబంధించి కూడా కోటి రూపాయల ఫుటేజ్ వేస్ట్ అయిందని తెలుస్తోంది. అయితే పుష్ప పార్ట్1కు సంబంధించి మిగిలిపోయిన ఫుటేజ్ పార్ట్2కు ఏ మాత్రం ఉపయోగపడదని సమాచారం. మూడు గంటల సినిమాకు సుకుమార్ ఏకంగా 4 గంటల ఫుటేజ్ ను తీశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు తొలి వారం పుష్ప ది రైజ్ కు బాగానే కలెక్షన్లు వచ్చినా రెండో వారం మాత్రం కలెక్షన్లు తగ్గాయని తెలుస్తోంది.

మరో 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తే పుష్ప ది రైజ్ హిట్ అవుతుంది. ఆంధ్రాలో అమలవుతున్న తక్కువ టికెట్ రేట్లతో పుష్ప అక్కడ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కు మాత్రం ప్రశంసలు వచ్చాయి. సినిమాసినిమాకు బన్నీకి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. పుష్ప ది రూల్ వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus