ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3వ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ చిత్రం.
‘పుష్ప’ 10 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 34.05 cr |
సీడెడ్ | 12.35 cr |
ఉత్తరాంధ్ర | 6.95 cr |
ఈస్ట్ | 4.43 cr |
వెస్ట్ | 3.65 cr |
గుంటూరు | 4.78 cr |
కృష్ణా | 3.77 cr |
నెల్లూరు | 2.82 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 72.80 cr |
తమిళ్ నాడు | 7.10 cr |
కేరళ | 3.30 cr |
కర్ణాటక | 9.45 cr |
రెస్ట్ | 16.50 cr |
ఓవర్సీస్ | 11.20 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 120.35 cr |
‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.120.35 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు రూ.25.65 కోట్ల షేర్ ను రాబట్టల్సి ఉంది.క్రిస్మస్ సెలవులని ఈ చిత్రం గట్టిగానే వాడుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!