Pushpa Movie: అల్లు అర్జున్ ‘పుష్ప’ సెన్సార్ వారు కట్ చేసిన సీన్లు..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం ‘పుష్ప’. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ముత్తంశెట్టి మీడియా వారితో కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. బుకింగ్స్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది ఈ చిత్రం. ఈ చిత్రానికి సెన్సార్ వారు కొన్ని కట్స్ తో యు/ఎ సెర్టిఫికెట్ ను జారీ చేశారు. పెద్ద సినిమాలకి ఏదో ఒక రకంగా యు/ఎ వేయించుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది కదా.

అందుకే కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని కట్ చేసి,మ్యూట్ చేసి మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులకి సానుకూలంగా వారు యు/ఎ ఇవ్వడం జరిగింది. అయితే సెన్సార్ కు బలైన ‘పుష్ప’ సన్నివేశాలు వాటి డైలాగులు ఏంటో ఓ లుక్కేయండి :

ప్రతీ సినిమాకి వేసేదే ‘మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం’.. నటీనటులు స్మోకింగ్ మరియు మద్యం సేవించేప్పుడు ఈ లైన్స్ వేస్తారు. అలాగే కొన్ని బ్రాండ్స్ ను కనిపించకుండా బ్లర్ చేయడం.

కొన్ని సన్నివేశాల్లో ‘లం*’ ‘లం* కొ*కా’ వంటి డైలాగ్స్ వచ్చినప్పుడు వీటిని మ్యూట్ చేయడం

ఓ సన్నివేశాల్లో ముం* అనే డైలాగ్ వచ్చినప్పుడు మ్యూట్ వేయడం

చెయ్యి నరికినప్పుడు బ్లర్ చేయడం

కొన్ని వియోలెన్స్ సన్నివేశాల్లో రక్తం ఎక్కువగా కనిపించకుండా బ్లర్ చేయడం

పుష్ప పోలీసులతో కలిసి మందు పార్టీలో ఉండగా లం* కొ*కా అనే డైలాగ్ వచ్చినప్పుడు దానిని కట్ చేయడం జరిగింది.

అది ‘పుష్ప’ లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా ఉండడంతో దర్శకుడు సుకుమార్ కొన్ని బోల్డ్ డైలాగులు, వియోలెన్స్ తో కూడుకున్న సన్నివేశాలు తెరకెక్కించక తప్పలేదు. ఇక రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ధనుంజయ,ఫహాద్ ఫాజిల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

1

2

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus