Pushpa Movie: పుష్ప సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే?

అల్లు అర్జున్ / సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాబు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే రీసెంట్ గా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులను పూర్తి చేశారు. సినిమాకు ఊహించినట్లే U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక సినిమాకి సంబంధించిన టాక్ ఎలా ఉంది అని విషయంలో అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి.

సినిమా నిడివి 2గంటల 59 నిమిషాలు ఉంటుందట. సినిమాలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనేలా ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నట్లు టీజర్ ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాలో ఎంట్రీ సీన్ లోనే అల్లు అర్జున్ ఊర మాస్ స్టైల్ లో ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. సుకుమార్ స్టైల్ లో కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో పుష్ప సినిమాతో చాలా క్లారిటీగా అర్ధమవుతుందట. ఇంటర్వెల్ బ్లాక్ కూడా లారీలతో కొనసాగే యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ అనుభూతిని కలిగిస్తుందని సమాచారం.

ఇక సునీల్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుందని ఫస్ట్ లుక్ తోనే అర్థమయ్యింది. ఇక తోడుగా అనసూయ కూడా బోల్డ్ రోల్ తో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సినిమా క్లామాక్స్ కూడా యాక్షన్ ప్రియులకు విందు భోజనం అంటున్నారు. అయితే మధ్యమధ్యలో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయని టాక్ కూడా వస్తోంది. మరి డిసెంబర్ 17న విడుదల కాబోయే పుష్ప ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus