అల్లు అర్జున్ – రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రమిది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్ళను సాధించింది.
ఒక్క ఆంధ్రలో తప్ప అన్ని భాషల్లోనూ ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది..!’పుష్ప’ క్లోజింగ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం
37.10 cr
సీడెడ్
15.00 cr
ఉత్తరాంధ్ర
8.03 cr
ఈస్ట్
4.89 cr
వెస్ట్
4.14 cr
గుంటూరు
5.34 cr
కృష్ణా
4.25 cr
నెల్లూరు
3.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
82.00 cr
తమిళ్ నాడు
10.90 cr
కేరళ
5.30 cr
కర్ణాటక
10.70 cr
రెస్ట్
42.00 cr
ఓవర్సీస్
14.25 cr
టోటల్ వరల్డ్ వైడ్
165.15 cr
‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.165.15 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.19.15 కోట్ల లాభాలను అందించింది కానీ ఆంధ్రలో బయ్యర్స్ మాత్రం భారీగా నష్టపోయారు.అయినప్పటికీ ఓవరాల్ గా ఈ చిత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి.